టేకులపల్లి, మే 19(జనంసాక్షి): ఇల్లందు,టేకులపల్లి సొసైటీల ద్వారా సేకరించిన మొక్కజొన్న బస్తాలను అధిక మొత్తంలో మొక్కజొన్న మార్కెట్ కమిటీ, ఇల్లందు, జిన్నింగ్ మిల్లు, కారేపల్లికి గోదాములలో భద్రపరచడానికి సోమవారం రాత్రి వరకు ఇల్లందు మార్కెట్ కమిటీలో 45 మంది హమాలీలు 75 ట్రిప్పుల ద్వారా 7500 మొక్కజొన్న బస్తాలను లోడ్ చేయగా, సుమారు 40 మంది హమాలీలు అట్టి మొక్కజొన్నల బస్తాలను దింపి వాటిని గోదాములో భద్రపరిచారు.
అలాగే టేకులపల్లి మండల కేంద్రం నుండి 4 లారీలు, 34 ట్రాక్టర్ల ద్వారా కారేపల్లి జిన్నింగ్ మిల్లుకు 6664 మొక్కజొన్న ల బస్తాలను తరలించి అక్కడ భద్రపరచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఈ రోజు నుండి ఇంకా ఎక్కువ బస్తాలను కొనుగోలుచేసి గోదాములకు తరలించ డం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు విషయం లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

