Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హావేలి ఘనపూర్ మండల అధ్యక్షులుగా కిరణ్ గౌడ్ నియామకం

హావేలి ఘనపూర్ మండల అధ్యక్షులుగా కిరణ్ గౌడ్ నియామకం

మెదక్ మే 20 (జనం సాక్షి)మెదక్ : మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ముత్తాయి కోట గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, న్యాయవాది గుండారం కిరణ్ గౌడ్ నియామకం అయ్యారు.మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లు మెదక్ జిల్లాలోని మండలాల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అందులో భాగంగానే హావేలి ఘనపూర్ మండలానికి కిరణ్ గౌడ్ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా కిరణ్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో హవేలి ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మండలం లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయనచెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi