` మరింత పటిష్టంగా భారత్`నార్వే బంధం ` ఇరు దేశాల మధ్య గ్రీన్ స్టాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు
` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోడీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్`నార్వే సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
ఇరు దేశాల మధ్య గ్రీన్ స్టాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే స్వచ్ఛ ఇంధనం, సముద్ర రంగం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు ప్రధాని తెలిపారు.పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌కు మద్దతుగా నిలిచినందుకు నార్వే ప్రభుత్వానికి మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అస్థిరత పెరుగుతున్న సమయంలో భారత్`యÖరప్ భాగస్వామ్యం మరింత కీలకమైందని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ నిబంధనలు, శాంతి భద్రతల పరిరక్షణలో భారత్, యÖరప్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
భారత్`ఈయÖ మధ్య చారిత్రక ఒప్పందంతో భారత్, నార్వేకు అనేక ప్రయోజనాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్`నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇస్రో`నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదిరిందని, పరిశోధనల కోసం నార్వే సహాయం తీసుకుంటామని పేర్కొన్నారు. నార్వే సంస్థలు భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ, షిప్పింగ్, బ్లూ ఎకానవిÖ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు. అలాగే ఆర్కిటిక్ పరిశోధనలు, అంతరిక్ష రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెవిÖకండక్టర్లు, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో కూడా భారత్`నార్వే కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.

