Dailyhunt
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ర్కొండ మే 05, ( జనం సాక్షి ) : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం రోజు ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట , ముచ్చర్ల పల్లి గ్రామలలో పర్యటించారు.

ముందుగా ఉరుకొండ పేట గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి గుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇళ్ల స్థితిగతులు, లబ్ధిదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో యూసుఫ్ అలీ, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి మండల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi