Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇటుక బట్టి కార్మికులకు విముక్తి

ఇటుక బట్టి కార్మికులకు విముక్తి

స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం

కార్మికుల దీనస్థితిని చూసి చలించిన జిల్లా న్యాయమూర్తి

ఆర్మూర్, మే19(జనంసాక్షి):

లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఆర్మూర్,ఆలూరు మండలాలలోని దేగం,మగ్గిడి గ్రామాలలోని ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులను బంధించి బలవంతంగా పనులు చేయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి,ఆర్మూర్ సీనియర్ న్యాయమూర్తి పి.శ్రీదేవి లేబర్, రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం ఆకస్మిక తనిఖీలు చేసి ఇటుక బట్టి కార్మికులకు విముక్తి కల్పించారు.
గ్రామాలలో పనిచేస్తున్న ఇటుక బట్టి కార్మికుల దినస్థితిని చూసి జిల్లా న్యాయమూర్తి చలించి కన్నీరు పెట్టుకున్నారు.కార్మికులను ఒక్కొక్కరిగా పిలిచించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.రోజువారీగా పనిచేయని కార్మికులను రూమ్ లో బంధించి మహిళలను చితక భాదారని న్యాయమూర్తి దృష్టికి కార్మికులు తీసుకోవచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి మాట్లాడుతూతెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కార్మికులకు పనిచేయిస్తూ ఇబ్బంది గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో ఉందని చెప్పారు.ఇటుక బట్టే కార్మికులకు కనీస వసతులు కల్పించకపోవడం,కనీస వేతనాలు చెల్లించకపోవడం,కార్మికులను శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం,లేబర్ చట్టాలను పాటించకపోవడం కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.ఇటుక బట్టి క్యాంపు నుండి పారిపోయిన వ్యక్తి హైదరాబాదు లీగల్ సర్వీస్ అథారిటీలో సంప్రదించారన్నారు.లేబర్ రికార్డ్స్ మైంటైన్ చేయకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడం పని చేయించడం స్పష్టంగా కనబడిందని చెప్పారు.1000 మంది పైగా ఇటుక బట్టి కార్మికులను రిస్క్యూ చేసి షెల్టర్ కల్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి , సదుపాయలతో పాటు వారికి రావాల్సిన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటుకబట్టి కార్మికులను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లేబర్ చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న ఇటుక బట్టి యజమానులపై చట్టరిత్య చర్యలు తీసుకొని సీజ్ చేయవలసిందిగా ఎమ్మార్వో,సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi