Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనం మెచ్చిన నేత కేటీఆర్

జనం మెచ్చిన నేత కేటీఆర్

* మమతలో ఘనంగా జన్మదిన వేడుకలు* పువ్వాడ ఆధ్వర్యంలో కేక్ కటింగ్.. అభిమానుల రక్తదానం
* విజనరీ లీడర్‌కు శుభాకాంక్షల వెల్లువ
ఖమ్మం, (జనంసాక్షి) :తెలంగాణను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రపంచపటంలో నిలిపి, నవతరం ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన విజనరీ లీడర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మమత హాస్పిటల్ ఆవరణలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, అభిమానుల నడుమ సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యవత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగులు తీర్పించిన యువ నాయకుడు కేటీఆర్ ఐటీ, పరిశ్రమల రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టి, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నవతరం రాజకీయాలకు కేటీఆర్ ఒక దిక్సూచిలా నిలిచారని కొనియాడారు. పట్టుదల, భవిష్యత్ ప్రణాళిక, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు కేటీఆర్ అన్నారు. ఆయన మరెన్నో ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి రాష్ట్రాన్ని మరింత పురోగతి వైపు నడిపించాలి అని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ జె సి కృష్ణ, దేవభక్తుని కిషోర్ బాబు, గొల్లపూడి రాంప్రసాద్, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, పగడాల నాగరాజు, బి రెడ్డి నాగచంద్రారెడ్డి, బిక్కసాని ప్రశాంత లక్ష్మి, షేక్ మక్బుల్, కర్నాటి కృష్ణ, షేక్ షకీనా, వాంకుడోత్ సురేష్, కందాల వీరేంద్ర, ఉస్మాన్, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, వెంకట్, తమ్మి రమేష్, పరిమళ ప్రవీణ్, షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi