Dailyhunt
జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా రాంపూర్ సాయి

కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తా

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 04:(జనం సాక్షి )

ళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని జనం పాట కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ సాయి అన్నారు.

శుక్రవారం నగరంలోని కంటేశ్వర్ లో జనం పాట కల్చరల్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గాన్ని శాలువ పూల మాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాంపూర్ సాయి మాట్లాడుతూ.. జనం నుంచి వచ్చిందే జనం పాట అన్నారు, ప్రజా సమస్యలపై, తెలంగాణ ఉద్యమం సమయంలో సైతం ఎన్నో అవగాహన కార్యక్రమాలుచేయడం జరిగిందన్నారు.

ఇకనుంచి జిల్లా కళాకారుల అభ్యున్నతి కోసం పోరాడుతామన్నారు. మాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న0దుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు ఉన్న కళాకారులను గుర్తించి, సమాజంలో కళకు ఉన్న ప్రాముఖ్యతను మరింత విస్తరించేలా చేస్తామన్నారు. గ్రామ గ్రామాన, మండల, నియోజకవర్గస్థాయిలో ప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కళా రంగంలో కళాకారులకు ఉన్న సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు. కళ కోసం తపించి, కళ కోసమే బ్రతికే కళాకారులు ఎందరో ఉన్నారని, వారందరికీ జనం పాట ఓ వేదిక కల్పించనుందన్నారు. గ్రామ మండలాలో ఉన్న కళాకారులు సభ్యత్వం తీసుకోవాలన్నారు.21 మంది కళాకారులతో రెండు సంవత్సరాల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.గౌరవ అధ్యక్షులుగా పస్క నర్సన్న, అధ్యక్షులుగా రాంపూర్ సాయి,ఉపాధ్యక్షులు రాజేందర్ చిన్న, ప్రశాంత్ రెడ్డి, సవిత లు, ప్రధాన కార్యదర్శిగా నల్ల మహేందర్,కోశాధికారి గోరకంటి రాజు, కార్యనిర్వహక కార్యదర్శి కర్క రమేష్,సహాయ కార్యదర్శులుగా ఏ.చిట్టిబాబు, డప్పు సంతోష్,సలహాదారులు ఆర్టీసీ మల్లన్న, కోకిల నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా నవీన్, సోనీ, డప్పు మహేష్, గణేష్, గోపాల్, ఆలెపు నరేష్, స్రవంతి, పద్మ, సతీష్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi