Dailyhunt
కడవేర్గులో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బడిబాట

కడవేర్గులో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బడిబాట

చేర్యాల (జనంసాక్షి) మే 04 : మండలంలోని కడవేర్గు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంపుకై సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోధ్యాయులు గొంటి బుచ్చయ్య మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు, ఉన్నత విద్యార్హతలతో కూడిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండటం, నాణ్యమైన నైతిక విలువలతో కూడిన విద్య లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నదని దానిలో భాగంగా వేసవి సెలవులు ముగిసి పాఠశాల ప్రారంభ రోజునే పాఠ్యపుస్తకాలు,నోటు బుక్స్,రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నదని,ఈ విద్యా సంవత్సరం నుండి ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేయబోతున్నదని అన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు బడిఈడు పిల్లలను గ్రామ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.అజయ్ కుమార్, వి.వేణుగోపాల్, కొడిపల్లి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi