Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరీంనగర్‌లో పట్టపగలే బంగారం షాపులో దోపిడీ.. కాల్పులు..

కరీంనగర్‌లో పట్టపగలే బంగారం షాపులో దోపిడీ.. కాల్పులు..

స్టమర్లలా వచ్చి.. నగలన్నీ కాజేసి.. ` కరీంనగర్‌లోని జ్యువెల్లరీ షాపులో భారీగా దోపిడీ
` అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆభరణాలన్నీ దొంగిలించిన దుండగులు

` ముగ్గురు సిబ్బందికి గాయాలు
` సీపీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు.
కరీంనగర్ బ్యూరో, మే 2 (జనంసాక్షి) :కరీంనగర్‌లోని పీఎంజీ జ్యువెల్లరీ షాపులో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కస్టమర్లలా దుకాణంలోకి ప్రవేశించారు. నగలు చూపించిన తర్వాత.. గన్‌తో బెదిరించారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మరోవైపు, చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న సీపీ గౌస్ ఆలం విచారణ చేస్తున్నారు. జ్యువెల్లరీ షాపు సవిÖపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగ్జీన్‌ను పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. సీసీ ఫుజేటీ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.
నిందితుల జాడ తెలిపితే రూ.లక్ష బహుమతి
కరీంనగర్‌లోని పీఎంజీ జ్యువెల్లరీ షాపులో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డ నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఐదుగురు నిందితుల ఫొటోలను విడుదల చేశారు. వారి జాడ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఆదివారం ఉదయం బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కస్టమర్లలా నగల దుకాణంలోకి ప్రవేశించారు. నగలు చూపించిన తర్వాత.. గన్‌తో బెదిరించారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు
కరీంనగర్‌లోని పీఎంజే నగల దుకాణంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఐదుగురు దుండగులు కస్టమర్లలా దుకాణంలోకి ప్రవేశించారు. నగలు చూపించిన తర్వాత తుపాకీలతో సిబ్బందిని బెదిరించి వారిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులు సిబ్బందిని గన్స్‌తో బెదిరించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వార్త చదివారా: కారుతో ఢీ కొట్టి.. 2 కి.విÖ ఈడ్చుకెళ్లి..
పథకం ప్రకారమే దోపిడీ
సమాచారం బండి సంజయ్?కు చేరడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు విచారణ ప్రారంభించారని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు చెప్పారు. క్లూస్ టీమ్ వివరాలు తీసుకుంటున్నారని, నిందితులు తెలుగు, హిందీ మాట్లాడుతున్నట్టు తెలిసిందన్నారు. పథకం ప్రకారమే ఈ దొంగతనం జరిగిందని భావిస్తున్నామన్న బండి సంజయ్, నిందితులను తప్పకుండా పట్టుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. షాపు సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించారన్న ఆయన, గాయపడిన వారికి ప్రాణాపాయం ఏవిÖ లేదని వైద్యులు చెప్పారని స్పష్టం చేశారు.
బాధితులను పరామర్శించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
తెలంగాణ మల్టీజోన్ `1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఆదివారం రోజు స్థానిక పి.ఎం.జె. జ్యువలర్స్ షాపు క్రైమ్ సీన్‌ను పరిశీలించి, చోరీ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ముందుగా ఆయన క్రైమ్ సీన్‌ను (ఘటనా స్థలాన్ని) క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తు పురోగతి పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, ఐజీపీ స్థానిక ఆసుపత్రిని సందర్శించి, ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ, వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఆయన వెంట కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi