హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
పార్కు పరిధిలో పర్యావరణ సున్నిత ప్రాంతంలో 25` 30 విÖటర్ల పరిధిలో ఉన్న చెట్లను కొట్టేయొద్దని ఆదేశించింది.ఈ పనుల కోసం పార్కు పరిధిలో సుమారు 1,300 చెట్లు నరికేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి వాదించారు.ప్రణాళిక ఏమైనా ఉందా? చెట్లు తొలగించకుండా నిర్మించవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాంటిదేవిÖ లేదని న్యాయవాది వివేక్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.
వాస్తవానికి ప్రభుత్వమే చెట్లను తొలగిస్తోందని.. రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లు నరుకుతున్నారని వివరించారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లు నరకొద్దని అభివృద్ధి బోర్డు చెప్పిందన్నారు. వాదనల అనంతరం ప్రతివాదులుగా రాష్ట్రప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.

