హయత్ నగర్, మే 15 (జనం సాక్షి)డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్.బి.నగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని, కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.ఇలాంటి అన్యాయ ధరల పెంపులను అడ్డుకునేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తూ, భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్ లు నియోజకవర్గ సీనియర్ నాయకులు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళ అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళా నాయకులు, వివిధ విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

