Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేన్స్ రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ మెరవనుంది

కేన్స్ రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ మెరవనుంది

భూదాన్ పోచంపల్లి, మే 16 (జనం సాక్షి ): ఇక్కత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ 2026లో జరిగే 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా పోచంపల్లి ఇక్కత్ చేనేత ప్రపంచ వేదికపై ప్రదర్శించబడుతుందని పేర్కొన్నారు. ఈ గుర్తింపు పోచంపల్లి నేతన్నలు, నేతక్కల కష్టానికి దక్కిన గౌరవమని తెలిపారు. తనను ఇక్కత్ చేనేత అంబాసిడర్‌గా నియమించిన భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, చేనేత శాఖ అధికారులు, పోచంపల్లి సంస్థలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మగ్గం నుండి రెడ్ కార్పెట్ వరకు తెలంగాణ నుండి కేన్స్ వరకు ఈ ప్రయాణం ప్రారంభమైంది అని రష్మీ ఠాకూర్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi