Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళంలో కొలువుదీరిన యÖడీఎఫ్ సర్కారు

కేరళంలో కొలువుదీరిన యÖడీఎఫ్ సర్కారు

` ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణం ` ఆయనతోపాటు మరో 19 మంది మంత్రులు కూడా..
` కార్యక్రమానికి హాజరైన రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్ రెడ్డి
తిరువనంతపురం(జనంసాక్షి):కేరళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

సోమవారం ఉదయం గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా, మొత్తం 20 మందితో మంత్రివర్గం ఏర్పాటు అయింది. సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 20 మందిలో 14 మంది తొలిసారిగా బాధ్యతలు చేపట్టినవారే కావడం గమనార్హం. సామాజిక, ప్రాంతీయ, మిత్రపక్షాల సవిÖకరణాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రులను ఎంపిక చేసింది. దీంతో దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యÖడీఎఫ్) తిరిగి అధికారంలోకి వచ్చింది. కేరళ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీఎం సతీశన్ ఆర్థిక, ఓడరేవుల శాఖలతో సహా పలు కీలక పోర్ట్‌ఫోలియోలను తనవద్దే ఉంచుకునే అవకాశం ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలకు విజిలెన్స్‌తో పాటు హోం శాఖ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు రెవెన్యూశాఖ కేటాయించాలని యÖడీఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే కొచ్చికి సవిÖపంలోని నెట్టూర్‌లో 1964లో వీడీ సతీశన్ జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన.. సామాజిక కార్యకర్తగానూ పేరొందారు. కేరళ విద్యార్థి విభాగంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత యÖత్ కాంగ్రెస్‌లో చేరి, పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత కాంగ్రెస్‌లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రజానేతగా, సంస్కరణాభిలాషిగా ఎదిగారు. 2001లో పరావుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి, వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. 2021లో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ గెలుపొందగా.. యÖడీఎఫ్ విపక్షానికే పరిమితమైంది. కానీ ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. అందుకే ప్రస్తుతం సీఎం ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయ సేకరణలో కూడా ఎమ్మెల్యేలు, ప్రజలు సతీశన్‌కే మద్దతు ఇచ్చారు.

కేరళంలోనూ మహిళలకు ఉచిత బస్సు
సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక విభాగం
ఆశావర్కర్ల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక సంక్షేమ, పాలనా సంబంధిత నిర్ణయాలను ప్రకటింటిన సీఎం వీడి సతీశన్)
తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కేరళం ముఖ్యమంత్రిగా సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన వీడి సతీశన్ తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక సంక్షేమ, పాలనా సంబంధిత నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 15వ తేదీ నుంచి మహిళలకు కేఎసఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థినులు, రోజువారీ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. వృద్ధతరం పెరుగుతుండటం, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ల హెల్త్‌కేర్, సామాజిక భద్రత, పునరావాసం, సంక్షేమ పథకాలను ఈ ప్రత్యేక శాఖ సమన్వయం చేస్తుందని చెప్పారు. ఆశావర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3,000కు పెంచుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి సతీశన్ ప్రకటించారు. కేరళం హెల్త్‌కేర్ సిస్టంలో ఆశా వర్కర్లు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వర్కర్లు, హెల్పర్లకు రూ.1,000 చొప్ప్పున వేతనం పెంచుతున్నామని, పాఠశాలల్లో వంటపనులు చేస్తున్న వారు, సహాయక సిబ్బంది, ప్రీ`పైమరీ టీచర్లకు అదనంగా రూ.1,000 వేతనం పెంచుతున్నామని చెప్పారు. 2023 నవ కేరళం యాత్ర సందర్భంగా యువజన కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం సతీశన్ ప్రకటించారు. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధించేందుకు, జవాబుదారీతనాన్ని పాదుకొలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని, రుణాలు, వ్యయం, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పారదర్శకతకు కట్టుబడి ఉంటామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi