Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లైబ్రరీలో ఘనంగా 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'

లైబ్రరీలో ఘనంగా 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'

యశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో శుక్రవారం 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ, విద్యా వారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కొమురయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలపై వివరిస్తూ, పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రంథాలయంలో బెస్ట్ పాఠకురాలును శాలవాతో ఘనంగా సన్మానించారు. పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి ముద్దమల్ల రాజేందర్, కౌన్సిలర్లు బొడ్డు అశోక్, రాధ, నాయకులు చల్లూరి సమ్మయ్య, చల్లూరి మధు, వివిధ సంఘాల నాయకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi