Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాడుగులపల్లిలో మైనర్ల చేతికి ట్రాక్టర్ స్టీరింగ్

మాడుగులపల్లిలో మైనర్ల చేతికి ట్రాక్టర్ స్టీరింగ్

మాడుగులపల్లి, మే 21( జనం సాక్షి): మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో నిబంధనలు పూర్తిగా పక్కనబెట్టారు. కనీస వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ బాలురు భారీ ట్రాక్టర్లను నడుపుతూ రోడ్లపై ప్రమాదకరంగా మట్టిని తరలిస్తున్నారు కనీసం పదో తరగతి కూడా పూర్తి చేయని, పాఠశాల వయస్సు గల విద్యార్థులు ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్లుగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ప్రాణాలతో చెలగాటం నిత్యం రద్దీగా ఉండే గ్రామీణ రహదారులపై ఈ మైనర్ బాలురు అతివేగంగా, అనాలోచితంగా ట్రాక్టర్లను నడుపుతున్నారు దీనివల్ల కాలినడకన వెళ్లే వృద్ధులు, పాఠశాల పిల్లలు, ఇతర వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదంముంచుకొస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేవలం కొద్దిపాటి కూలి డబ్బుల కోసం కొంతమంది యజమానులు, కాంట్రాక్టర్లు చట్టాన్ని ఉల్లంఘించి, చిన్న పిల్లల జీవితాలతో పాటు ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.అధికారుల నిర్లక్ష్యంగ్రామంలో ఇంత బహిరంగంగా మైనర్ డ్రైవింగ్, మట్టి రవాణా సాగుతున్నప్పటికీ, అటు రవాణా శాఖ (RTO) అధికారులు గానీ, ఇటు స్థానిక పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిబంధనల ప్రకారం మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులతో పాటు, తల్లిదండ్రులపై కూడా కఠిన కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం యథేచ్ఛగా ఈ వ్యవహారం నడుస్తోంది.చర్యలు తీసుకోవాలిపదో తరగతి కూడా దాటని పిల్లల చేతికి భారీ వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గోపాలపురం గ్రామంలో తనిఖీలు చేపట్టాలి మైనర్లతో ట్రాక్టర్లు నడిపిస్తున్న యజమానులపై, అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని గ్రామస్థులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi