నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నెం మల్లారెడ్డి ..
నడి కూడ మే 21 (జనం సాక్షి) :భారతదేశ సాంకేతిక విప్లవ పితామహుడు, దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నడికూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వారు రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ భారత దేశ పురోభివృద్ధికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించడానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మలహల్ రావు, నార్లపూర్ సర్పంచ్ పెద్దవేన రవిందర్, రాయపర్తి సర్పంచ్ రాజ జగత్ ప్రకాశ్, కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగండ తిరుపతి, దర్మారం సర్పంచ్ బాసిక ఎల్లస్వామి, చౌటుపర్తి సర్పంచ్ ఓదెల
సమ్మయ్య మరియు సమన్వయ కమిటీ సభ్యులు పాడి వివేక్, నారగాని కుమారస్వామి, అప్పం చేరారు, మహిళా నాయకురాలు బిల్లకంటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

