` క్లిష్ట పరిస్థితులు తప్పవు.. ` 'తుపాను వచ్చే ముందు ప్రశాంతంగానే ఉంటుంది
` ఏఐ ఫొటోతో ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
` టెహ్రాన్ త్వరగా ఒక ఒప్పందానికి రావాలని లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక
` అమెరికా`ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితులు
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా`ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 'తుపాను వచ్చే ముందు ప్రశాంతంగానే ఉంటుంది' అంటూ ఓ ఏఐ ఫొటోతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై వైమానిక దాడులను పునఃప్రారంభించడంపై ట్రంప్ తన యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలు చేయడం గమనార్హం. ఏఐతో రూపొందించిన ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఆ ఫొటోలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధనౌకలు ప్రయాణిస్తున్నాయి. అక్కడే ట్రంప్, ఆయన పక్కన ఒక యÖఎస్ నేవీ అడ్మిరల్ నిలబడి ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న నౌకలపై ఇరాన్ జెండాలు ఉండటం గమనార్హం. దీనికి తుపానకు ముందు ప్రశాంతంగానే ఉంటుందని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. అమెరికా`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. హర్మూజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో దాడులు పునఃప్రారంభించడంపై ఆయన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండగా.. ఆయన ఈ ఫొటో పంచుకోవడం ఆందోళనలను పెంచుతోంది.
క్లిష్ట పరిస్థితులు తప్పవు..
ఇక ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ నేరుగా ఇరాన్‌ను హెచ్చరించారు. టెహ్రాన్ త్వరగా ఒక ఒప్పందానికి రావాలని లేదంటే.. క్లిష్ట పరిస్థితులు తప్పవన్నారు. ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదురుతుందా లేదా అనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. తమతో డీల్ కుదుర్చుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

