Dailyhunt
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

భీమదేవరపల్లి:ఏప్రిల్04(జనం సాక్షి)

మండలంలోని కొప్పూరు గ్రామానికి చెందిన ఉగ్గే మధుకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.ఈ నేపథ్యంలో శనివారం స్థానిక సర్పంచ్ గద్ద కుమారస్వామి,వార్డు సభ్యులు,పలు నాయకులు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడేందుకు రూ.2,000 సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సంఘం శ్రీనివాస్, నాయకులు ఆరకాల శంకర్, మండ కరంచంద్ కొత్త నరతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi