Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముందుంది మండేకాలం

ముందుంది మండేకాలం

` తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్ ` రానున్న 5 రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం
` అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఐఎండీ
` అధిక ఎండలతో పాటు, వడగాలులు వీచే అవకాశం

` పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ
` జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. కాగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిపాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ 16 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో నెలకొన్న గాలి విచ్ఛిన్నతితో రాష్ట్రంలో ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు వడగాలుల ప్రభావంతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశంతో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. రాష్ట్రంలో సోమవారం 41 నుంచి 44 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్?, మేడ్చల్`మాల్కాజిగిరి, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్? కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా టవల్‌ను తలకు కట్టుకోవాలి. ముక్కు, చెవుల ద్వారా వేడి గాలి లోపలికి వెళ్లకుండా ఉండే విధంగా కర్చీఫ్‌ను కట్టుకోవాలి. నూలు వస్తాలను ధరించాలి.గర్భిణులు, పిల్లలు, వృద్దులు, దీర్ఘకాల రోగాలతో సతమతమవుతున్న వారు జాగ్రత్తలు పాటించడం మంచిది. రేకుల ఇండ్లలో నివాసం ఉంటున్న వారు, వేడి గాలులు నేరుగా ఇళ్లలోకి వచ్చేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రేకులపై గడ్డి లేదా జనపనార సంచులను వేసి వేడిని తగ్గించుకోవాలి. ఎండ తీవ్రతకు చెమటతో పాటు శరీరంలోని ఎలక్టోలైట్స్ అధికంగా పోతుంటాయి. ఫలితంగా అలసటతో పాటు అస్వస్థత కలుగుతుంది. అందువల్ల వీలైనంత ఎక్కువగా నీరు తీసుకోవాలి. కొబ్బరి నీరు, ఓఆరఎస్ ద్రావణం, నీరు తీసుకోడం ఉత్తమం. నిమ్మరసం ఉప్పు, చక్కెర కలిపి తాగొచ్చు. వడదెబ్బకు గురైనట్లయితే వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లి తల నుంచి కాళ్ల వరకు తడి గుడ్డతో పూర్తిగా తుడవాలి. పేషెంట్‌కు గాలి ఆడేవిధంగా చూడాలి. కొంత తేరుకున్న తర్వాత ఓఆరఎస్ ద్రావణాన్ని తాగించి హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలి.ఎవరైనా వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి.కొన్ని రక్తపోటు మందులతో మÖత్ర విసర్జన అధికంగా ఉంటుంది. మÖత్రం ద్వారా కూడా సోడియం, పొటాషియం తదితర లవణాలు బయటకు వెళ్తూ ఉంటాయి. వీరు నీరు ఎక్కువగా తీసుకోవాలి.పైన వివరించిన జాగ్రత్తలు పాటించడం ద్వారా వడదెబ్బకు గురికాకుండా కాపాడుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi