వరంగల్ ఈస్ట్, మే 18 (జనం సాక్షి)రుద్రమదేవి పరపతి సంఘానికి తాను బాకీ ఉన్నాను అంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని పరపతి సంఘం డైరెక్టర్ ముష్కమల్ల సుధాకర్ అన్నారు.
ఒకవేళ నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమే తెలిపారు. ఈమెరకు ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం తాను ఎక్కువ మంది సభ్యులను చేర్పించానన్నారు. సంఘ డైరెక్టర్లైన గుంటి వీరేందర్, పూజారి సంపత్ వద్ద సుమారు 30 లక్షల రూపాయలు ఉన్నాయని, అలాగే మరో డైరెక్టర్ మంద శ్రీనివాస వద్ద సుమారు 20 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు.
మొత్తం 50 లక్షల రూపాయలు సంఘానికి వారే బాకీ ఉన్నారని గుర్తు చేశారు. వారు ముందుగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నవంబర్ నెల నుండి సుమారు 200 మందికి తాను సంఘ సభ్యులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తూ వస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సుధాకర్ పేర్కొన్నారు. సంఘంలో మిగిలిన డబ్బులను ప్రత్యేక అప్పుగా తీసుకున్న డబ్బుకు మూడు రూపాయల వడ్డీ చొప్పున లక్షల రూపాయలు కమిటీ సభ్యులకు సాధారణ సభ్యులకు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మిగతా కమిటీ డైరెక్టర్లు తాము తీసుకున్న డబ్బులకు వడ్డీతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా సుధాకర్ డిమాండ్ చేశారు.

