నల్లగొండ ప్రతినిధి,మే 14, (జనం సాక్షి): నల్లగొండ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో మంటలు చెలరేగి 3 షెడ్లు దహనం అయ్యాయి. మెరుపు వేగంలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసు బృందాలు మంటలు అదుపులోకి తీసుకొని రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
గొల్లగూడ పెద్ద బండకు చెందిన యువకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 7 గురు సిబ్బంది నిరంతర ప్రక్రియలో భాగంగా గౌడన్స్ పర్యవేక్షణ చేస్తున్నా ఇది ఊహించని పరిణామం. జేసీబీ రంగ ప్రవేశంతో తలుపులు బద్దలుకొట్టి మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణమా లేక వేరేనా? : సిఐ రాఘవ రావు
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎఫ్ సిఐ గౌడన్స్ లో ఏర్పడిన మంటలను అదుపులోకి తేవడానికి మా సిబ్బంది ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నము. కానీ అక్కడ ఆ గౌడన్స్ కి ఐరన్ డోర్ లు ఉండటం వల్ల చాలా కష్టతరంగా మారింది. పరిస్థితిని అదుపులో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
ఆ షేడ్స్ కి కరెంటు కలెక్షన్ లేదు : సువీన్, డివిజనల్ మేనేజర్ ఫుడ్ కార్పొరేషన్
3 షేడ్స్ విలువైన వస్తువులు అయితే ఏమి లేవు. కానీ వాటికి కరెంటు కలెక్షన్ లేదు. కానీ ఈ సంఘటన ఎలా జరిగిందో తెలియడం లేదు. అలాగే దాంట్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో మాకు కూడా తెలియదు. రేపు ఉదయం చూస్తే తెలుస్తుంది.
యువత మెరుపు వేగం ఆదర్శం : కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్
మా కాలనీ లో జరిగిన ఈ పరిణామంతో యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈ మంటలను అదుపులోకి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు ఫైర్ ఇంజన్ నీరు ఖాళీ అయింది. అదుపులోకి వచ్చేలా చేస్తున్నాం.

