` విజయంపై ఎవరి ధీమా వారిదే.. ` బెంగాల్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
` 11 జిల్లాల్లో హై అలర్ట్
` బంగాల్ ఎన్నికల ఫలితాలపై జాతీయస్థాయిలో ఆసక్తి
` అధికార టీఎంసీ`బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం
` ఇరు పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
న్యూఢిల్లీ(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్టాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఫలితాల ద్వారా కీలక రాష్టాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్‌ల భవితవ్యం తేలనుంది. గతానికి భిన్నంగా ఆయా రాష్టాల్లో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఈ రాష్టాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందని అంచనా! దక్షిణాదిలో ఎర్రకోటగా పేరొందిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టి నెలకొంది. వరుసగా మÖడోసారి అధికారం చేపట్టి రికార్డ్ సృష్టించాలని ఎల్‌డీఎఫ్ భావిస్తుండగా 2024 లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న యÖడీఎఫ్ సీఎం పీఠంపై గురి పెట్టింది. మరోవైపు కామ్రేడ్ల కోటలో ఉనికి చాటుకోవాలని ఎన్డీయే ఉవ్విళ్లూరుతోంది. 3 కూటములకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అలాగే యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. సోమవారం ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రముఖ నటుడు విజయ్ పార్టీ 'టీవీకే' రంగంలోకి దిగడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీఎంకేకు ప్రజలు మళ్లీ పట్టంకట్టనున్నారా? లేక ప్రతిపక్ష అన్నాడీఎంకే మళ్లీ పుంజుకుంటుందా? లేదా విజయ్ సరికొత్త చరిత్ర లిఖించనున్నారా? ఈ ప్రశ్నలకు నేడే జవాబు దొరకనుంది.ముఖ్యంగా బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హోరాహోరీ ప్రచారం, రికార్డు స్థాయి పోలింగ్, టీఎంసీ` బీజేపీ మధ్య గట్టిపోటీ నెలకొందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య సోమవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. నాల్గోసారి మళ్లీ అధికారం చేపట్టాలని అధికార టీఎంసీ భావిస్తుండగా, చరిత్రాత్మక విజయంతో బంగాల్ గడ్డపై తొలిసారి కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.బంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకుగానూ 293 నియోజకర్గాల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 'ఫల్తా' నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాల కారణంగా పోలింగ్‌ను ఈసీ రద్దుచేసింది. అక్కడ ఈనెల 21న రీ`పోలింగ్, మే 24న కౌంటింగ్ జరగనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 2నియోజకవర్గాల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం రీపోలింగ్ ముగిసింది. 87శాతం ఓటింగ్ నమోదైంది. రెండు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా బంగాల్‌లో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధానపోటీదారులైన Tఓఅ, ఃఏఖలు కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బంగాల్‌లో 92.47 శాతం ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. 2.5లక్షల మంది కేంద్ర పారా మిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసుల భారీ బందోబస్తు మధ్య చెదురుమదురు ఘటనలు మినహా రెండు విడతల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
అందరి దృష్టి 'భవానీపుర' నియోజకవర్గంపైనే
మొత్తం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కోల్‌కతాలోని 11 నియోజకవర్గాలకుగానూ 5 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉందన్న టీఎంసీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. స్టాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీలతోపాటు మÖడంచెల భద్రత, 165మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లు, 77మంది పోలీస్ అబ్జర్వర్లను రంగంలోకి దించామని అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్ పాస్ ఉన్న వారినే కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు అందరి దృష్టి 'భవానీపుర' నియోజకవర్గంపైనే నెలకొంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఇక్కడ బరిలో ఉన్నారు. దీనికి సంబంధించిన కౌంటింగ్ సఖావత్ మెమోరియల్ కేంద్రంలో జరగనుంది.
ఆ 11 జిల్లాల్లో హై అలర్ట్
మరోవైపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి భద్రతా సవిÖక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశమున్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది. ఆయా జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, కూచ్ బెహార్, మాల్దా, నాడియా, బీర్‌భూం, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ వంటి జిల్లాలు ఉన్నాయి. ఫలితాలు వెలువడే సమయంలో ఎటువంటి హింస, అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలను హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు వివరించారు.
ఒక్క ప్రాణనష్టం కూడా జరగకపోవడం ఇదే మొదటిసారి
రాష్ట్రవ్యాప్తంగా 75వేల మంది కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెప్పారు. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల అధునాతన మార్క్స్‌మ్యాన్ సాయుధ వాహనాలను రంగంలోకి దించారు. బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో అదనపు నిఘాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ విÖడియాలో రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ పార్టీల సోషల్ విÖడియా అకౌంట్లు, వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎనఐఏ అధికారులు నిఘా ఉంచారు. అధికారిక లెక్కల ప్రకారం 2011 ఎన్నికల సమయంలో 25మంది ప్రాణాలు కోల్పోయారు. 2016 ఎన్నికల్లో 30మంది మృతిచెందగా, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా 58మంది మరణించారు. మళ్లీ అటువంటి హింస జరగకుండా నివారించేందుకు ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. దశాబ్దాల బంగాల్? ఎన్నికల చరిత్రలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకపోవడం ఇదే మొదటిసారి.
90లక్షల మంది ఓటర్లను తొలగించిన వివాదాస్పద 'ఎసఐఆర' ప్రక్రియ తర్వాత బంగాల్‌లో జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర అగ్రనేతలు బీజేపీ తరఫున ప్రచారం చేశారు. బంగాల్ సర్కార్ అవినీతి, శాంతిభద్రతలు, అక్రమచొరబాట్లు, మహిళా భద్రత, నిరుద్యోగం వంటి అంశాలపై టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలుచేస్తామని హావిÖ ఇచ్చారు. టీఎంసీ తరఫున సీఎం మమతాబెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నీ తామై ప్రచారం చేశారు. Sఎఖీ వేధింపులు, బెంగాలీల అణచివేత, స్థానికేతరులనే అంశాలతోపాటు జాతీయ హావిÖలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. రికార్డు స్థాయిలో ఓటు వేసిన బంగాల్? ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే.

