` నేడు కొలువుదీరనున్న యÖడీఎఫ్ ప్రభుత్వం ` ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ఖరారు
` కార్యక్రమానికి హాజరుకానున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఇతర సీనియర్ నేతలు
` కాంగ్రెస్ పాలిత రాష్టాల సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం
తిరువనంతపురం(జనంసాక్షి):కేరళలో సోమవారం వీడీ సతీశన్ సారథ్యంలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్`యÖడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగంసిద్ధమైంది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి 12 మంది, ఐయÖఎంఎల్ నుంచి ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.అయితే, భాగస్వామ్యపక్షాలతో ఇవాళ జరిగిన చర్చల్లో కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు కానున్న ముఖ్యమంత్రి సతీశన్ తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు రమేశ్ చెన్నితలా, మురళీధరన్, సన్నీ జోసెఫ్‌లు కేబినెట్‌లో చేరనున్నట్లు చెప్పారు. యÖడీఎఫ్?లో కీలక భాగస్వామి అయిన ఐయÖఎంఎల్‌కు 5 పోర్టుపోలియోలు దక్కాయి. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు సాదిక్ అలీ, వీడీ సతీశన్ కేబినెట్‌లో చేరనున్న ఐదుగురి పేర్లను ప్రకటించారు. సీనియర్ శాసనసభ్యుడు తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా, షానిమోల్ ఉస్మాన్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని కూడా యÖడీఎఫ్ నిర్ణయించింది.ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. వీరితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది.

