సిరికొండ, జూలై 07 (జనం సాక్షి): సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామ పంచాయతీలో ప్రత్యేక ఇంటింటి సర్వే (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ పాల్గొని గ్రామ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమంలో నిరక్షరాస్యులు, వృద్ధులు, స్వయంగా ఫారాలు నింపలేని వారికి ఎస్‌ఐఆర్ ఏనుమరేషన్ ఫారాలను నింపించి, అవసరమైన వివరాలను నమోదు చేయడంలో సహాయం చేశారు. అలాగే ప్రజల్లో ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేస్తూ ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఖచ్చితంగా నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని అన్నారు. ఎవరూ ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

