విద్యార్థిలను అభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు
రేగోడ్,ఏప్రిల్29(జనంసాక్షి):
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మెదక్ జిల్లా రేగోడు తెలంగాణ మోడల్ స్కూల్ బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.
బుధవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో
మండలంలో మొత్తంగా 194 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 188 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ గురునాథ్ విలేకరులతో వెల్లడించారు. మోడల్ స్కూల్ విద్యార్థి ఎం. కీర్తన 576 మార్కులు సాధించి మండల మొదటి టాపర్ గా నిలిచారు. తూర్పు హర్షవర్ధని 567 మార్కులు సాధించి మండల రెండవ టాపర్ గా తన సత్తా చాటుకున్నారు. నిక్షిత 561 మార్కులు సాధించి మూడవ టాపర్ గా నిలిచారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండల టాపర్లుగా నిలిచిన మోడల్ స్కూల్ విద్యార్థిని లను ఎంఈఓ గురునాథ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ, ఉపాధ్యాయ బృందం, ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.

