హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2026 27 విద్యా సంవత్సరానికి దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రధానాచార్యులు.
డాక్టర్ పి. సురేష్ బాబు తెలిపారు. కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరానికి మొత్తం అన్ని కోర్సులలో కలిపి 960 సీట్లు అందుబాటులో ఉన్నాయని, కోర్సుల వారీగా సీట్ల వివరాలు బిఎ ఇంగ్లీష్ మీడియం 180సీట్లు, బి ఏ తెలుగు మీడియం 60 సీట్లు, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ 240 సీట్లు, బి. కామ్ ( ఫైనాన్స్ ) 60 సీట్లు, బి బి ఏ కోర్సులో 60 సీట్లు, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ 180 సీట్లు, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ 120 సీట్లు, బి ఎస్సి డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్ మెంట్ 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.కళాశాలలో సువిశాల ప్రాంగణంలో విశాలమైన తరగతి గదులు, 17 అదనపు తరగతి గదుల నిర్మాణం, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ టీచింగ్ సదుపాయాలు, అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు, జాతీయ స్థాయిలో నాక్, ఐ ఎస్ ఓ గుర్తింపుతో అత్యున్నత విద్యా ప్రమాణాలలో రంగారెడ్డి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలియజేశారు.
అత్యుత్తమ గ్రంధాలయం, జాతీయ, అంతర్జాతీయ క్రీడల కోసం శిక్షణ, ఎన్ ఎస్ ఎస్, యన్ సి సి (నేవీ) క్యాడేట్లు ప్రతి సంవత్సరం రాష్ట్రపతి పరేడ్ లో విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. నిరుపేద విదార్థులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ కు అతి సమీపంలోనే , ప్రభుత్వ వసతిగృహాలలో విద్యార్ధినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ సాకర్ణ్యం కలదని చెప్పారు. దోస్త్ వెబ్సైట్ https://dost.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, కళాశాల కోడ్: 2037 , దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసేటప్పుడు, వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ మా కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి కళాశాలలో అడ్మిషన్ పొందగలరని తెలియజేస్తున్నాము.దోస్త్ సెకండ్ ఫేస్ 15 మే నుండి 25 మే 2026 లోగా దోస్త్ ద్వారా అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ ఇచ్చి సీటు పొందగలరని, అడ్మిషన్లకు సంబంధించిన ఇతర వివరాలకు దోస్త్ కో ఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ 9948985954, దోస్త్ టెక్నికల్ అసిస్టెంట్ వినయ్ కుమార్ 9666338001ల ద్వారా సంప్రదించవచ్చునని తెలియజేశారు.

