లక్ష్మణ చందా, మే14 ( జనం సాక్షి): ఈరోజు లక్ష్మణ చందా మండలంలోని రాచాపూర్ లో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. వడ్యాల్ శివారులోని అనుబంధ గ్రామమైన రాచాపూర్ లో వరి సాగు విస్తీర్ణం 1526 ఎకరాలు సాగు చేయగా 1276 మంది రైతులు దొడ్డు రకం వరి సాగు చేస్తూ ఉంటారు.
మండలంలోని రెండవ స్థానంలో రాచాపూర్ గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి ఒకటే ఐకెపి సెంటర్ ఉండటంవల్ల తీవ్ర ఇబ్బందులకు రైతులు గురవుతున్నారు. ప్రతి సీజన్లో ఈ గ్రామం నుండి 70 నుండి 80 లారీల వరకు ధాన్యం తరలించడం జరుగుతుంది.ఈ క్రమంలో గత మే ఒకటో తారీఖున ప్రారంభమైన ఈ ఐకెపి సెంటర్ నుండి కేవలం ఐదు లారీలు మాత్రమే వెళ్లడం విశేషం. 15 రోజుల నుండి ప్రారంభమైన కూడా ఇప్పటివరకు ఐదువేల గన్నీలు మాత్రమే రావడం మరియు దానికి సరిపడా లారీలు కూడా రాకపోవడం విశేషం.
దాని గురించి వరి ధాన్యాన్ని కూడా వెంట వెంటనే కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేయడం జరిగింది. రైతుల డిమాండ్ జై జవాన్ జై కిసాన్ అంటూ రైతు లేనిదే రాజ్యం లేదు వరి ధాన్యం కొనుగోలు వెంట వెంటనే కావాలంటూ అధికారులను రైతుల ప్రశ్నించడం జరిగింది. ఈ ధర్నా స్థానిక ఎమ్మార్వో సరిత వచ్చి అడిషనల్ గా మరో సెంటర్ను ఏర్పాటు చేస్తామని, హమాలీల కొరత లేకుండా మరియు లారీలు కూడా వెంట వెంట పంపిస్తామని చెప్పడంతో ఎట్టకేలకే ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ చందా ఎస్సై శ్రావణి, సోన్ ఎస్సై గోపి, డిప్యూటీ తాసిల్దార్ బాబు సింగ్ రాథోడ్ మరియు రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

