సదాశివపేట మే 1(జనం సాక్షి)సదాశివపేటలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలోని పౌర సరఫరాల గోదాం వద్ద బి ఆర్ టియు కార్మిక సంఘం అనుబంధ సంఘం, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.కె బాబు మియా ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను కృషి చేసేందుకు ఎల్లప్పుడూ పోరాటం చేస్తామన్నారు. కెసిఆర్ సీఎంగా ఉన్నప్పుడు కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్.కె బాబు మియా మాట్లాడుతూ చికాగో నగరంలో అమరులైన కార్మికుల రక్తంతో ఎర్రజెండా ఆవిర్భవించిందని, ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు కేంద్ర ప్రభుత్వం కాల రాస్తుందని అన్నారు.
కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. కార్మికులు చాలీచాలని వేతనాలతో కాలం వెలదీస్తున్నారని, ప్రతి కార్మికునికి ప్రభుత్వం పరంగా రావాల్సిన అన్ని లాభాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, బిఆర్ఎస్ నాయకులు చింతా సాయినాథ్,కొత్తగొల్ల కృష్ణ,నాగుల విజయ్, సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఎస్.కె.
ఖుర్షీద్ పాషా, ఏం. ప్రభు, ఏసురత్నం, ఎం.డి. వహీద్, ఎస్.కె. పాషా మియా, వెంకటేశం, ఔసాద్ పాషా తదితరులు పాల్గొన్నారు

