Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమాజ హితులు ఆర్యవైశ్యులు

సమాజ హితులు ఆర్యవైశ్యులు

సూర్యాపేట(జనంసాక్షి)సమాజం మేలు కోరుకునే హితులు ఆర్యవైశ్యులని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, సుప్రీంకోర్టు అడ్వకేట్, రిటైర్డ్ జడ్జి, శ్రీవాసవి సేవా సమితి జాతీయ లీగల్ అడ్వైజర్ నేరెళ్ల మాల్యాద్రి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో శ్రీవాసవి సేవా సమితి నూతన జిల్లా కార్యాలయాన్ని వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో చూపిస్తున్న కులస్తులు ఆర్యవైశ్యులని అన్నారు.సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా అవకాశం ఆర్యవైశ్యుల దక్కడం ఆనందంగా ఉందన్నారు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆర్యవైశ్యుల పాత్ర వెలకట్టలేనిది అన్నారు . నిరుపేదల కష్టాలు బాధలు చూసి చదివించే మనసు ఉన్న ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందు వరుసలో ఉన్నారన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు దేవాలయాలకు తీసుకువెళ్లాలని దీని ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయం భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను నాటుతూ, సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటూ ఏ చిన్న సమస్య ఉన్న పరిష్కరించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, కె.శ్రీనివాసరావు,కాంగ్రెస్ నాయకులు ఫరూక్, గౌరవ చైర్మన్ ఈగ దయాకర్ గుప్తా, జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, గౌరవ సలహాదారులు గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు బచ్చు శ్రీనివాస్,సోమా సుమన్, తప్సి అనిల్ కుమార్, కోటా శివ, కర్నాటి కృష్ణ , బొల్లం సురేష్ ,సభ్యులు కొండ అనిల్ కుమార్, శ్రీరంగం రాము, సోమ ధనుంజయ్, మనసాని నాగేశ్వరరావు,మిట్టపల్లి రమేష్, బెలిదే శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్, చందా రాజశేఖర్ , గుడిపాటి రమేష్ వెంపటి శబరినాథ్, తల్లాడ రాము,బుక్క రమేష్, బచ్చు నీరజ, తెడ్ల పల్లవి, ఉప్పలంచు కృష్ణ,మహంకాళి సోమయ్య పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi