గంభీరావుపేట మే 15(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం
సముద్రలింగపూర్ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వెళ్తున్న ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ బస్సును ఓ కారు, బైక్ ఢీకొన్నాయి.
ఈ ఘటనలో కారులో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, ద్విచక్రవాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

