జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి
మెదక్ మే 14 (జనం సాక్షి )
శిశు విక్రయాలు జరిగితే కఠిన
చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.ఆడ శిశువును 3 లక్షలకు అమ్మిన తల్లి తండ్రులు కూల్చరం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన దంపతులు తమ 4 వ శిశువును అమ్ముకున్నారనే విషయం మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టడం జరిగినది.
ఇట్టి విచారణలో కన్న తల్లి తండ్రులు తమ పాపను 3 లక్షలకు అమ్ముకున్నారని నిర్దారించుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ లో తగు చర్యల కొరకై పిర్యాదు చేయడం జరిగినది.ఇట్టి విచారణలో తెలిసినది కూల్చరం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన దంపతులకు ఇదివరకే 3 సంతానం ఉండగా తేదీ 27.3.2026 నాడు మెదక్ లోని ఎం సిహెచ్ హాస్పిటల్ లో ఆడ పాప జన్మించడం జరిగినది. పాపను దంపతులిద్దరూ 3 లక్షలకు కొంత మంది మధ్యవర్తుల ద్వారా అల్లినగర్, ములుగు మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతులకు విక్రయించడం జరిగించడం జరిగినది. ఇట్టి విషయం పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పాపను తీసుకువచ్చి మహిళా శిశు సంక్షేమ అధికారులకు అప్పగించడం జరిగినది అధికారులు సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు పాపను తదుపరి సంరక్షణ నిమిత్తం సంగారెడ్డి లోని శిశుగృహ కు తరలించి ఆశ్రయం కల్పించడం జరిగినది.జిల్లాలో అక్రమ దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేస్తూ, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవలంటే ప్రభుత్వ నియమ నిభందనల ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖ లోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

