Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిరిసిల్లలో ఉద్రిక్తతత

సిరిసిల్లలో ఉద్రిక్తతత

మే 18,(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టయిన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని పాత బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి.

ఈ ఘటనలో పలువురు బీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు.

బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడినప్పటికీ బీఆర్ఎస్ నేతలు నిరసనలు ఆపలేదు. బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తలెత్తడంతో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే, డీఎస్పీ నాగేంద్రచారి బీజేపీ నేతలను అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక బీఆర్ఎస్ నేతలను సముదాయించి పంపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi