Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పిన అగ్ని ప్రమాదం సకాలంలో స్పందించిన పంచాయతీ సిబ్బంది

తప్పిన అగ్ని ప్రమాదం సకాలంలో స్పందించిన పంచాయతీ సిబ్బంది

మాడుగులపల్లి,మే 18 ( జనం సాక్షి):మండల కేంద్రంలో ఆదివారం ఒక పెద్ద అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది స్థానిక ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న ఒక బావిలో గుర్తుతెలియని వ్యక్తులు మంట పెట్టడంతో ఒక్కసారిగా ప్రమాదం చెలరేగింది ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రతకు తోడు ఈదురు గాలులు వీస్తున్నాయి ఈ క్రమంలో ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బావిలో నిప్పు పెట్టారు బావిలో ఉన్న ఎండుటాకులు, చెత్తకు ఆ నిప్పు అంటుకుని ఒక్కసారిగా విపరీతమైన మంటలు పైకి ఎగసిపడ్డాయిఈ మంటలు పక్కనే రైతులు విక్రయానికి తెచ్చిన ఐకేపీ వడ్ల కుప్పల వైపు వేగంగా వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన ఒక స్థానిక యువకుడు వెంటనే గ్రామ పంచాయతీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సమాచారం అందిన వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది అత్యంత వేగంగా స్పందించారు ట్రాక్టర్ నీళ్ల ట్యాంకర్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు పంచాయతీ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఐకేపీ సెంటర్‌లోని వడ్ల కుప్పలు సురక్షితంగా మిగిలాయి దీంతో రైతులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు పంచాయతీ విజ్ఞప్తి ఈ సంఘటనపై గ్రామ పంచాయతీ అధికారులు స్పందిస్తూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వేసవి కాలంలో చిన్న అగ్గిపుల్ల అయినా క్షణాల్లో పెను ప్రమాదానికి దారితీస్తుందని, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనుల వల్ల భారీ నష్టం జరుగుతుందని హెచ్చరించారు ఐకేపీ సెంటర్లలో రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు ఉన్నాయని, ఎవరూ కూడా ఐకేపీ సెంటర్లు, గడ్డివాములు, ఎండిన పొలాల పరిసరాల్లో నిప్పు పెట్టడం లాంటి పనులు చేయకూడదని కోరారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ నిప్పు విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi