Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పును తప్పించుకోవడానికి రాజీనామా..

తప్పును తప్పించుకోవడానికి రాజీనామా..

ల్లగొండ ప్రతినిధి,జూన్ 01,(జనం సాక్షి): నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పులిపాటి అంజలి గడిచిన కొన్ని రోజుల క్రితం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పాఠశాల ఆవరణంలో ఉన్నటువంటి చెట్లను కిరాయి మనుషుల్ని పెట్టించి మరి సెలవు దినం రోజున అంటే ఆదివారం నాడు నరికి వేయించింది ఇదే విషయమై జనం సాక్షిలో వార్తగా ప్రచురణ చేయడం ద్వారా వెంటనే స్పందించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వారిపై కేసు నమోదు చేసి ఫైన్ కట్టించుకోవడం జరిగింది.

ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు తనపై చర్యలు తీసుకొని తనని సస్పెండ్ చేస్తారేమోనని భయపడి ముందస్తుగానే నాకు పని ఒత్తిడి ఉండడం వల్ల ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నానని డీఈఓ కి లెటర్ పెట్టడం జరిగింది మొత్తం సమస్య సద్దుమణిగినాక మళ్ళీ ఉద్యోగం ఎక్కడానికి సిద్ధమైంది మేడం తప్పును తప్పించుకోవడానికి మరో తప్పు చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మరి తిరిగి జాయిన్ కావడానికి జిల్లా ఉన్నతాధికారులు సహకరించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆమెపై పలు ఆరోపణలు ఉన్న మళ్లీ ఆ పోస్టింగ్ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా తిరిగి ఆ ఉద్యోగ బాధ్యతలను ఆమె అప్పగించడం వెనక పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రేపు జెండా ఎగుర వేయడానికి సిద్ధమైన ఆ అధికారిణి: పాఠశాల ఆవరణలో ఉన్నా చెట్లను నరికివేసి సొమ్ము చేసుకుందామనుకున్నా ఆ అధికారిని తనకు తానుగా ఈ ఉద్యోగం చేయలేను అని చెప్పేసి రిజైన్ చేసిన తర్వాత కూడా మళ్లీ ఆమెకే పోస్టింగ్ ఇవ్వడం వెనక చాలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఎన్ని రోజులపాటు అక్కడే స్థానికంగా పనిచేసే టీచర్ కి ఆ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలను ప్రస్తుత ఇన్చార్జి బాధ్యతలుగా ఇవ్వడం జరిగింది మళ్లీ మేడం అక్కడ అడుగులు పెట్టడంతో అక్కడున్నటువంటి సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.అలాగే రేపు జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పాటశాల లో జెండా ఎగురవేయడం కోసం సిద్దమైనట్లు సమాచారం.మరి ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు మరోసారి ఆలోచించి ఆమె చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు తప్పును తప్పించుకునేందుకు చేసిన చర్యలను క్షుణ్ణంగా విచారణ చేసి ఆమె మీద శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi