Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణకు పొంచిఉన్న 'హీట్‌వేవ' ముప్ప్పు

తెలంగాణకు పొంచిఉన్న 'హీట్‌వేవ' ముప్ప్పు

` ప్రమాదంలో 1.60 కోట్ల మంది ప్రజలు ` రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
` ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో రాష్ట్రంలో 301 మండలాలకు ముప్పు

` తాజా నివేదకలో ప్రభుత్వం వెల్లడి ` వడదెబ్బతో పెరుగుతున్న మరణాలు
` 37 డిగ్రీలు దాటితే అప్రమత్తం కావాల్సిందేనన్న అధికారులు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్టానికి వడగాలులు ప్రకృతి విపత్తులా పరిణమించాయి. ఏటా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, తరిగిపోతున్న పచ్చదనం, మితివిÖరిన ప్లాస్టిక్ వాడకం తదితరాలు ఇందుకు ముఖ్య కారణం. గతం కంటే భిన్నంగా ఈ ఏడాది సమ్మర్?లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను తాకడంతో రాష్ట్రంలోని 301 మండలాల్లో 1.60 కోట్ల మంది వడగాలుల ముప్పు ముంగిట నిల్చున్నారు. 6 మండలాలు తీవ్ర ముప్పు, 106 మండలాలు అధిక 189 మండలాలు మధ్యస్త ముప్పు జాబితాలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2014`25 సంవత్సరాల మధ్య 612 మండలాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు, వడగాలుల సంఖ్య ఆధారంగా ఈ పరిణామాన్ని తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంస్థ(తెలంగాణ డెవలప్?మెంట్ ప్లానింగ్ సొసైటీ), వాతావరణ శాఖలు సంయుక్తంగా అంచనా వేశాయి. సాధారణ స్థితితో పోలిస్తే వరుసగా 3 రోజులపాటు 4 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం లేదంటే 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన చోట హీట్‌వేవ్ ఉన్నట్లు గుర్తిస్తారు. ఈ ప్రమాణాల ప్రకారం 2014 నుంచి గత సంవత్సరం వరకు నల్గొండ జిల్లాలో అత్యధికంగా వడగాలులు నమోదయ్యాయి. ఇక్కడి మండలాలు అత్యధిక ముప్పు ముంగిట ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాలు కూడా ఇదే జాబితాలో ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఆరుబయట పనిచేసే కార్మికులు, అన్నదాతలు, రైతు కూలీలు, ఇతర వృత్తుల వారు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వడగాలుల బారినపడి 2014 నుంచి ఇప్పటివరకు ఏటా కనీసం 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మరణాలు సంభవిస్తున్నాయి.అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బతో శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం మారేడుపల్లికి చెందిన జాగేటి రాధ(52), ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెనికి చెందిన తేజావత్ చాప్లి(75) అస్వస్థతకు గురై మృతిచెందారు.వాతావరణంలో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటినట్లయితే శరీరం బయటి వేడిని స్వీకరించడం ప్రారంభిస్తుంది. అప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచేందుకు అంతర్గత అవయవాలు అధికశాతం చెమటను విడుదల చేస్తాయి. ఆ సమయంలో తగినంత నీరు, ద్రావణాలు తీసుకోనట్లయితే డీహైడ్రేషన్‌కు గురవుతారు. రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్ 15వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 42`45 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. అంటే అన్ని జిల్లాల్లో ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్`2026ను విడుదల చేసింది. అన్ని ఆస్పత్రుల్లో ఓఆరఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతోంది. చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ, కూలింగ్ షెడ్లను ఏర్పాటు చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi