Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు

తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు

` విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ` ఇంజినీరింగ్‌లో 1,44,704, అగ్రికల్చర్`ఫార్మసీలో 84,954 మంది పరీక్ష రాసిన విద్యార్థులు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.

ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, జేఎన్‌టీయÖ వీసీ టి.కిషన్ కుమార్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. గతేడాది కంటే ఇంజినీరింగ్‌లో ఈసారి 0.1 శాతం ఉత్తీర్ణత పెరిగిందని అధికారులు తెలిపారు. కాగా వారం రోజుల్లో కౌన్సెలింగ్‌కి షెడ్యూల్ ప్రకటిస్తామని జేఎన్‌టీయÖ అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,97,241 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,44,704 మంది మంది విద్యార్థులు అర్హత సాధించారు.

అగ్రికల్చర్, ఫార్మసీ స్టీమ్‌లో 84,954 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే, 73,294 మంది అర్హత సాధించారు.పరీక్ష పూర్తయిన ఆరో రోజే ఫలితాలు విడుదల : ఎప్‌సెట్ పరీక్ష పూర్తయిన ఆరో రోజే ఫలితాలు వెలువడటం విశేషం. ఇంజినీరింగ్‌లో టాప్`10 ర్యాంకర్ల వివరాల్ని విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా వివరించారు. ఫలితాల లాగిన్ విండోలో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్టేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ర్యాంక్ కార్డును సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఫార్మాలో టాపర్స్‌గా నిలిచిన వారి వివరాల్ని సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో 3వ, 4వ ర్యాంకులో నిలిచిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. కాగా అగ్రికల్చర్, ఫార్మాలో 6,7,9వ స్థానాల్లో నిలిచిన వారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi