Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి..

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి..

ఉపాధి పనులను పరిశీలించిన సర్పంచ్ మహేందర్ రెడ్డి

డికుడ మే 22 (జనం సాక్షి) : నడి కూడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ ప్రజలు ఉపాధి హామీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పెండ్యాల మహేందర్ రెడ్డి గ్రామ ప్రజలను కోరారు శుక్రవారం గ్రామంలోని ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీ అధికారి మౌనికతో కలిసి పని ప్రదేశంలో పనులను పరిశీలించారు అనంతరం కూలీలతో ముచ్చటిస్తూ ఎండ తీవ్రత ఉన్నందున ఉదయం 5 గంటలకు వచ్చి 9 గంటల లోపు ఉపాధి హామీ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లాలని ఉపాధి కూలీలకు తెలియజేశారు అదేవిధంగా ఉపాధి హామీ పనికి వచ్చే కూలీలు ఉపాధి పనికి రాకుండా గ్రామంలో ఉండే వారికి ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా అవగాహన కల్పిస్తూ తెలియజేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi