Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాస్విక్ ఫౌండేషన్ను అభినందించిన ప్రజలు ప్రయాణికులు

వాస్విక్ ఫౌండేషన్ను అభినందించిన ప్రజలు ప్రయాణికులు

చ్చన్నపేట మే 15 ( జనం సాక్షి ): జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్.

ఈ ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో తీవ్రమైన ఎండల వల్ల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉన్నత లక్ష్యంతోనే తమ ఫౌండేషన్ తరపున ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు .ఈ సేవా కార్యక్రమంలో వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు ఆముదాల భూపాల్ రెడ్డి, నూకల భాస్కర్ రెడ్డి, నూకల రమేష్ రెడ్డి, కొన్నే స్వామి, భాస్కర్, నరేష్, రవీందర్ రెడ్డి,గణేష్, మహిపాల్ రెడ్డి. మల్లయ్య. ఆంజనేయులు మరియు స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫౌండేషన్ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని మండల ప్రజలు ప్రయాణికులు అభినందించారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi