Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టండి

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టండి

` వారానికి రెండు రోజులు ఈ పద్ధతిని అనుసరించండి ` అన్ని రాష్టాల హైకోర్టులకు సీజేఐ సూచనలు
న్యూఢిల్లీ(జనంసాక్షి):అన్ని రాష్టాల హైకోర్టు సీజేలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమÖర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచనలు చేశారు.

కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరిస్తున్న విధానాన్ని పాటించాలని సూచించారు. సోమ, శుక్ర వారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేయాలన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. కేసు విచారణ వర్చువల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. హైకోర్టుల్లోనూ ఇలాగే జరిగేలా చూడాలని సీజేఐకి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన సీజేఐ.. గత శుక్రవారమే హైకోర్టుల సీజేలకు సూచనలు చేశామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi