2027 ODI World Cup Qualifiers: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన అతిపెద్ద ప్రకటన వెలువడింది.
కొత్త నిబంధనలు - 'సూపర్ సిరీస్' ఆరంభం: ఈసారి ప్రపంచకప్‌ను మొత్తం 14 జట్లతో నిర్వహించనుండటంతో అర్హత విధానంలో ఐసీసీ విప్లవాత్మక మార్పులు చేసింది: విజేతకు డైరెక్ట్ ఎంట్రీ: క్వాలిఫయర్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ప్రపంచకప్‌లోని 12 జట్లు ఉండే ప్రధాన దశకు అర్హత పొందుతుంది. సూపర్ సిరీస్: క్వాలిఫయర్స్‌లో 2, 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నమెంట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన సూపర్ సిరీస్ దశకు అర్హత సాధిస్తాయి. ప్రధాన గ్రూప్ స్టేజ్‌లోని చివరి బెర్త్ కోసం ఈ మూడు జట్లు పోటీపడాల్సి ఉంటుంది. పోటీలో పాల్గొనే 10 జట్లు ఇవే: ఈ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు తలపడతాయి.
1. 2026 సెప్టెంబర్ 30 కటాఫ్ నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో ఆతిథ్య దేశాలు (దక్షిణాఫ్రికా, జింబాబ్వే) మినహా అట్టడుగున ఉన్న 2 ఐసీసీ పూర్తిస్థాయి సభ్య దేశాలు. 2. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 నుండి టాప్ 4 జట్లు.
3. వరల్డ్ కప్ క్వాలిఫయర్ ప్లేఆఫ్స్ నుండి మరో 4 జట్లు. కరేబియన్ జట్టుకు కష్టాలు - వెస్టిండీస్‌పై తీవ్ర ఒత్తిడి: ఈ కొత్త ర్యాంకింగ్స్ రేసు మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ కు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న కరేబియన్ జట్టు, క్వాలిఫయర్స్ ఆడే అవసరం లేకుండా నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే తమ ర్యాంకును మెరుగుపరుచుకోవాలి. అయితే సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీ లోపు వెస్టిండీస్‌కు భారత్‌తో కేవలం 2 వన్డే మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్ - ఐర్లాండ్ మధ్య జరగబోయే వన్డే సిరీస్ ఫలితాలు కూడా వెస్టిండీస్ భవిష్యత్తును తేల్చనున్నాయి. దీంతో నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించే జట్లేవో తెలియక తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

