Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IRCTC Dark Patterns: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.. IRCTC వెబ్‌సైట్, యాప్‌లలో డార్క్ ప్యాటర్న్‌ల కలకలం.. లోకల్‌సర్కిల్స్ సర్వేలో షాకింగ్ నిజాలు!

IRCTC Dark Patterns: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.. IRCTC వెబ్‌సైట్, యాప్‌లలో డార్క్ ప్యాటర్న్‌ల కలకలం.. లోకల్‌సర్కిల్స్ సర్వేలో షాకింగ్ నిజాలు!

IRCTC Dark Patterns: రైలు టిక్కెట్ బుక్ చేసుకోవడం సులభతరంగా ఉండాలనేది సామాన్య ప్రయాణికుడి కోరిక. కానీ ఐఆర్‌సిటిసి (IRCTC) డిజిటల్ వేదికలలో వినియోగదారులు అనేక ఇబ్బందులను, పారదర్శకత లేని డిజైన్ పద్ధతులను ఎదుర్కొంటున్నారని లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వే స్పష్టం చేసింది.
324 జిల్లాల్లోని 90,000 మందికి పైగా ఐఆర్‌సిటిసి వినియోగదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక విడుదలయ్యింది. వినియోగదారులు తమకు తెలియకుండానే అదనపు రుసుములు చెల్లించేలా, కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉండే డార్క్ ప్యాటర్న్స్ (Dark Patterns) ఈ వేదికపై విరివిగా ఉన్నట్లు వెల్లడైంది. iPhone అభిమానులకు గుడ్‌న్యూస్.. Apple సెప్టెంబర్ 9 ఈవెంట్ ఖరారు..

iPhone 18 Pro, Pro Max లాంచ్‌పై భారీ అంచనాలు..
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) గుర్తించిన 13 రకాల అస్పష్ట విధానాలలో, IRCTCలో ప్రధానంగా 6 రకాల డార్క్ ప్యాటర్న్‌లు ప్రత్యక్షమవుతున్నాయని సర్వే పేర్కొంది. వెలుగుచూసిన 6 ప్రధాన డార్క్ ప్యాటర్న్‌లు: బలవంతపు చర్యలు (70% బాధితులు): టిక్కెట్ బుక్ చేసే కీలక సమయంలో ఎలాంటి కారణం లేకుండా సిస్టమ్ నుంచి అకస్మాత్తుగా లాగ్ అవుట్ అవ్వడం. దీనివల్ల ప్రయాణికులు మళ్లీ మొదటి నుంచి బుకింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోంది. పదేపదే విసుగు పుట్టించడం (46%): లావాదేవీల మధ్యలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని, ప్రమోషనల్ ఆఫర్లు చూడమని లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోమని పదేపదే పాప్-అప్‌ల ద్వారా అంతరాయం కలిగించడం.

బాస్కెట్ స్నీకింగ్ (45%): ప్రయాణికులు స్వచ్ఛందంగా ఎంచుకోకపోయినప్పటికీ ప్రయాణ బీమా (Travel Insurance), భోజనం లేదా క్లాస్ అప్‌గ్రేడ్ ఎంపికలు డిఫాల్ట్‌గా కార్డ్‌లో చేరిపోవడం. డ్రిప్ ప్రైసింగ్ (43%): ప్రారంభంలో చూపించే ధర కంటే, చెల్లింపుల ముగింపు దశకు వచ్చేసరికి దాగివున్న అదనపు ఛార్జీలు మరియు సౌకర్య రుసుములను జోడించడం. ఎర వేసి మోసం చేయడం (38%): వినియోగదారుడు మొదట ఎంచుకున్న రైలు, తరగతి లేదా సీటుకు భిన్నమైన వివరాలు బుకింగ్ ప్రక్రియలో ఆటోమేటిక్‌గా మారిపోవడం. ఇంటర్‌ఫేస్ అంతరాయం (31%): స్క్రీన్ డిజైన్ ద్వారా వినియోగదారుడి దృష్టిని మళ్లించి ఇతర సేవలు కొనేలా ప్రోత్సహించడం.

వెబ్‌సైట్ వేగం పెరిగినప్పటికీ డార్క్ ప్యాటర్న్‌ల డిజైన్ మారలేదని, దీనివల్ల సర్వర్ సామర్థ్యం పెరిగినా వినియోగదారుడి అనుభవం మెరుగుపడలేదని నివేదిక పేర్కొంది. ఆర్‌బిఐ నిబంధనల తరహాలోనే ప్రయాణ బీమా వంటి యాడ్-ఆన్‌లకు డిఫాల్ట్ సెట్టింగ్ 'నో' (No) అని మాత్రమే ఉండాలని, యూజర్ స్వయంగా ఎంచుకుంటేనే వాటిని చేర్చాలని సర్వే ప్రతిపాదించింది. ఇప్పటికే డార్క్ ప్యాటర్న్‌లను ఉపయోగిస్తున్న పలు ప్రైవేట్ సంస్థలకు CCPA జరిమానాలు విధించింది. అయితే వినియోగదారుల హక్కులు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు సమానంగా వర్తించాలని, 68% ప్రభుత్వ వాటా ఉన్న IRCTCపై కూడా థర్డ్-పార్టీ ఆడిట్ నిర్వహించి పారదర్శకత పెంచాలని లోకల్‌సర్కిల్స్ కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Latestly Telugu