Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jubilee Hills CI Suspension: జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. న్యాయం కోసం వచ్చిన మహిళపై దారుణం..

Jubilee Hills CI Suspension: జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. న్యాయం కోసం వచ్చిన మహిళపై దారుణం..

Jubilee Hills CI Suspension: ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా.. ఆమెను గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బి.సి.
సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై బాధితురాలు నేరుగా ఫిర్యాదు చేయడంతో డీజీపీ సి.వి. ఆనంద్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను మల్టీజోన్ ఐజీ షానవాజ్ ఖాసీంకు అప్పగించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసు విచారణలో భాగంగా బాధితురాలు అందజేసిన సాక్ష్యాధారాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. విచారణ క్రమంలో బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సీఐ స్వయంగా సదరు యువతిని తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు ఆధారాలు లభించాయని, ఆసుపత్రి రికార్డుల్లోనూ ఈ వివరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీనికి తోడు, వ్యక్తిగత లైంగిక వీడియోలను సాకుగా చూపి బాధితురాలి నుంచి దాదాపు రూ.2 కోట్లు పిండుకున్నట్లు వెల్లడైంది. అందులో సుమారు రూ.50 లక్షల వరకు సీఐ తన భార్య బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించుకున్న ఆధారాలు లభించాయి.

మిగిలిన మొత్తాన్ని సీఐ సూచనల మేరకు ఏ ఏ ఖాతాల్లోకి జమ చేసిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తుండగా.. కొంత సొమ్ము సీఐ బినామీల ఖాతాల్లోకి వెళ్లినట్లు దర్యాప్తులో ఆధారాలు బయటపడ్డాయి.
చాదర్‌ఘాట్ ఆటోలో అసభ్యకర ఘటన.. మైనర్ నిందితుడికి నెల రోజుల పాటు సామాజిక సేవ శిక్ష విధించిన జువైనల్ జస్టిస్ బోర్డు తన అక్రమాలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి..

బాధితురాలికి ఫోన్ చేసి పరోక్షంగా బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ఫోటోలు, వీడియోలతో సహా నాపై ఫిర్యాదు చేశావు. అందులో నేను ఒక్కడినే లేను, నువ్వు కూడా ఉన్నావు. ఆడపిల్లవు కదా...

జాగ్రత్త అని ఆయన వ్యాఖ్యానించినట్లు సంభాషణల రికార్డులు సూచిస్తున్నాయి. దీనికి ధైర్యంగా సమాధానమిచ్చిన బాధితురాలు.. లిఫ్ట్‌లో దుస్తులు ఊడదీసి కొట్టినప్పుడు, నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డున పడేసినప్పుడు నేను ఆడపిల్లనని గుర్తురాలేదా? నా పరువూ, ప్రాణాలు పోయినా సరే తేల్చుకోవడానికి సిద్ధమే అని నిలదీసినట్లు సేకరించిన సాక్ష్యాధారాల ద్వారా వెల్లడైంది.

ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఈ వ్యవహారంలో బలమైన పక్కా ఆధారాలను సేకరించడంతో పాటు బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా అధికారికంగా రికార్డు చేశారు. బాధితురాలిపై లైంగిక దాడితో పాటు.. రూ.2 కోట్ల దందా సాక్ష్యాధారాలతో సహా నిరూపణ కావడంతో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. త్వరలోనే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Latestly Telugu