Stree Shakti Scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్న ఏసీ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి కష్టాలను తీర్చేందుకే 'దీపం' పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఏపీ విద్యార్థులకు శుభవార్త.. తల్లికి వందనం నిధుల విడుదలపై కీలక అప్‌డేట్.. ఎప్పుడు విడుదల చేస్తారంటే.. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెగా డీఎస్సీని అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకంగా 350 కేసులు వేశాయని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆపలేరని హితవు పలికారు. కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి పార్టీలు ఏకమయ్యాయని, ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించారు.

