Thai Woman Flight Assault: దుబాయ్ నుండి బ్యాంకాక్‌కు బయలుదేరిన విమానంలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాణంలో నిద్రిస్తున్న సమయంలో తనపై ఒక పాకిస్తానీ ప్రయాణికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని..
ఫిలిప్పీన్స్ పబ్లిక్ పార్కులో విద్యార్థుల సె*క్స్ వీడియో వైరల్.. క్లిప్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక నిద్రపోతున్న సమయంలో ఎవరో తన కుడి పిరుదును తాకుతున్నట్లు, అక్కడ తడిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, దుప్పటి కప్పుకుని ఉండటంతో మొదట దాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆమె వివరించారు. కొంతసేపటి తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి, ఆ వ్యక్తి తనవైపే నిరంతరం చూస్తుండటాన్ని, ఆమె ముందర ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ను తాకే నెపంతో పదేపదే చేయి చాచడాన్ని గమనించారు. విమానం బ్యాంకాక్‌లో దిగడానికి సుమారు గంటన్నర ముందు, ఈ విషయంపై క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
విమానం గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే జరిగిన ఘోరాన్ని ఫ్లైట్ అటెండెంట్‌కు వివరించగా.. సిబ్బంది ఆ పాకిస్తానీ వ్యక్తిని విచారించారు. విచారణలో నిందితుడు తాను చేసిన తప్పును ఒప్పుకుని, మోకాళ్లపై కూర్చుని ఏడుస్తూ క్షమాపణలు కోరాడు. అయితే, ఆమె ఆ క్షమాపణను తిరస్కరించి, అతడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.
ఈ క్రమంలో ఒక ఎయిర్‌లైన్ ఉద్యోగి సదరు మహిళ ప్యాంటుపై వీర్యపు మరకలలాంటి గుర్తును గమనించడంతో ఆమె మరింత దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసుపై థాయిలాండ్ పర్యాటక పోలీసులు, ఇమ్మిగ్రేషన్ బ్యూరో, డాన్ ముయాంగ్ పోలీస్ స్టేషన్ అధికారులు ఉమ్మడిగా దర్యాప్తు జరుపుతున్నారు. కేసు విచారణ దశలో ఉన్నందున నిందితుడిని ఇమ్మిగ్రేషన్ కస్టడీలోనే ఉంచారు. విమానాల్లో అపరిచితుల పక్కన కూర్చున్నప్పుడు ప్రయాణికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆ మహిళ విజ్ఞప్తి చేశారు.
ఇదే తరహా వార్తలో.. బ్యాంకాక్ నుండి ముంబై వెళ్లే విమానంలో క్యాబిన్ సిబ్బందిపై (ఎయిర్‌హోస్టెస్) లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఒక స్వీడన్ పౌరుడు అరెస్ట్ అయ్యాడు. అయితే, అతడి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. నిందితుడికి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా ఆ మహిళను తాకలేదని డిఫెన్స్ వాదనను తెరపైకి తెచ్చారు.

