వార్తలు
కమ్యూనిటీ ఫీడ్...గూగుల్ మ్యాప్స్‌లో కొత్త అప్డేట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. దీంతో ప్రయాణాలు లేకపోవడంతో మ్యాపింగ్, నావిగేషన్ సేవల వినియోగం విపరీతంగా తగ్గిపోయింది. అయితే, ఈ సమయాన్ని గూగుల్ మ్యాప్స్ తన సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా జన సమూహాన్ని తెలియజేసే ఫీచర్‌ను ఇటీవలే జోడించింది. ఎవరైనా రెస్టారెంట్లు, వ్యాపారాలు, తెలిసిన ప్రదేశాలు, వాటి చుట్టూ ఉన్న ప్రసిద్ధ ప్రదేశాలను కనుగొనాలంటే గూగుల్ మ్యాప్స్ ఉపయోగకరమైన అప్లికేషన్ అనే విషయం తెలిసిందే.
తాజాగా గూగుల్ మ్యాప్ యూజర్లకు ఆహార విభాగానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు 'కమ్యూనిటీ ఫీడ్'ను పరిచయం చేయనున్నట్లు పేర్కొంది.
ఈ ఫీచర్‌ను పొందాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ యాప్‌కి వెళ్లి అందులో ఎక్స్ప్లోర్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లైతే మీకు మీ సమీపంలోని జనాదారణ పొందిన షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలు, ఆహార స్టాల్స్, ఇతర సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాక, స్థానిక నిపుణులచే గూగుల్ మ్యాప్స్‌లో జోడించిన తాజా సమీక్షలు, ఫోటోలు, పోస్ట్‌లను కూడా దీనిలో చూపిస్తుంది.
గూగుల్ తన కమ్యూనిటీ ఫీడ్‌లో ఉపయోగకరమైన స్థానిక సమాచారాన్ని ఒకచోట చేర్చి, వినియోగదారుల ఆసక్తులకు అనుగుణంగా సంబంధింత సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు వారి గూగుల్ మ్యాప్స్‌తో తనకు నచ్చిన ఆహారం, పానీయాలను సెర్చ్ చేస్తే సమీపంలోని రెస్టారెంట్లు, వాటి ఫోటోలు, వ్యాపార పోస్ట్‌లను, రివ్యూలను చూడవచ్చు. కమ్యూనిటీ ఫీడ్‌లో భాగంగా స్థానిక వనరుల నుండి అప్డేట్లను, సిఫార్సులను యూజర్ పొందుతాడు.
ఈ క్రొత్త కమ్యూనిటీ ఫీడ్ స్థానిక వ్యాపారాల అభివృద్ధికి కూడా సహాయపడుతుందని, మ్యాప్‌లో ఆయా రెస్టారెంట్ల సమాచారాన్ని వెతకడం సులభతరం అవుతుందని గూగుల్ పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ లో ప్రస్తుతం ప్రతి రోజూ 20 మిలియన్ రేటింగ్‌లు/సమీక్షలు, ఫోటోలు, సమాధానాలు వస్తున్నాయని గూగుల్ పేర్కొంది. కాగా, అతి త్వరలోనే మీరు ఫాలో అయ్యే ప్రదేశాలు, ఆహార స్టాల్స్, పానీయాల వ్యాపారుల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
related stories
-
జాతీయం-అంతర్జాతీయం 'యూపీఐ' అప్‌గ్రేడేషన్
-
తాజా వార్తలు నియర్‌బై షేర్ తరహా..గూగుల్ కొత్త ఫీచర్
-
వార్తలు బాత్రూమ్ లో ఫోన్ ఉపయోగిస్తే ఈ సమస్యలు తప్పవు..!