Wednesday, 02 Dec, 9.49 pm Lifeberrys Telugu

వార్తలు
నోకియా లాంచ్ చేసిన సీ3 స్మార్ట్ ఫోన్‌పై ధర తగ్గింపు...

నోకియా ఈమధ్యే లాంచ్ చేసిన నోకియా సీ3 స్మార్ట్ ఫోన్‌పై ధర తగ్గింపును అందించింది. వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.7,499గా ఉండగా, ఇప్పుడు రూ.6,999కు తగ్గింది. దీనిపై రూ.500 తగ్గించారు. దీంతోపాటు 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌పై కూడా తగ్గింపును అందించారు. దీని ధర రూ.8,999 నుంచి రూ.7,999కు తగ్గింది. అంటే దీనిపై రూ.1,000 తగ్గించారన్న మాట. స్యాన్, శాండ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

నోకియా సీ3 స్పెసిఫికేషన్లు...

ఇందులో 5.99 అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లేను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకభాగంలో ఉంది.

దీని స్టోరేజ్ సామర్థ్యం 32 జీబీగా ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 128 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్ ను కూడా ఇందులో అందించడం విశేషం. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు.

ఇందులో వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3040 ఎంఏహెచ్ గా ఉంది.

ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 16.5 రోజుల స్టాండ్ బై టైమ్ లేదా 50 గంటల టాక్ టైం లభిస్తుందని నోకియా తెలిపింది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, మైక్రో యూఎస్ బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 184.5 గ్రాములుగా ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Lifeberrys Telugu
Top