వార్తలు
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సెలింగ్కు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇవాళ ప్రకటించింది.
ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 6 నుంచి 12 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించింది. ఈనెల 8 నుంచి 12 వరకు పరిశీలన ఉంటుందని వెల్లడించింది. 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తామని మండలి ప్రకటించింది. ఈ నెల 22 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపింది.
22న స్లాట్ బుకింగ్, 23న ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు.
26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు తర్వాత 28న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వివరించింది.
related stories
-
తెలంగాణ తాజావార్తలు ఏప్రిల్ 7 నుంచి ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ
-
తెలంగాణ తాజావార్తలు 'ఎండీ మెడికల్ జెనెటిక్స్' పేరిట కొత్త కోర్సు
-
తెలంగాణ ఆగస్టులో తెలంగాణ ఐసెట్, ఏప్రిల్ 3న నోటిఫికేషన్: పరీక్ష ఫీజు వివరాలివే