Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్

10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్

maa gulf 4 days ago

దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) తన 'ఈదియా' (Eidiya) ఏటీఎం సేవలు మే 21నుండి ఖతార్‌లోని వివిధ ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

మొత్తం 10 ప్రాంతాల్లో 52 ఏటీఎంలు అందుబాటులో ఉంటాయని, వీటి ద్వారా 5, 10, 50, 100 మరియు 200 విలువ కలిగిన ఖతారీ రియాల్ నోట్లను విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

ఈదియా ATMలు ఉన్న ప్రాంతాలు:

వెండోమ్ మాల్ వద్ద 5 ATMలు

ఖతార్ మాల్ వద్ద 5 ATMలు

అల్ వక్రా ఓల్డ్ సౌక్ వద్ద 5 ATMలు

ఎజ్దాన్ మాల్ వక్రా వద్ద 4 ATMలు

దోహా ఫెస్టివల్ సిటీ (DFC) వద్ద 8 ATMలు

అల్ హజ్మ్ మాల్ వద్ద 5 ATMలు

వెస్ట్ వాక్ వద్ద 5 ATMలు

అల్ ఖోర్ వద్ద 5 ATMలు

అల్ మీరా (Muaither) వద్ద 5 ATMలు

అల్ మీరా (Al-Thumama) వద్ద 5 ATMలు

అధిక నగదు పంపిణీ సామర్థ్యం కలిగిన, కొత్తగా అప్డేట్ చేసిన ATM యంత్రాల ద్వారా ఈ సర్వీస్ పనిచేస్తుందని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

చిన్న పిల్లలకు డబ్బును బహుమతిగా ఇచ్చే సంప్రదాయమైన 'ఈదీ ' ఆచరణకు సంబంధించిన ఖతార్ వారసత్వాన్ని మరియు సంస్కృతిని పరిరక్షించే సమగ్ర ప్రయత్నంలో భాగంగా ఈ సేవ అందుబాటులోకి వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu