Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2.4% మేర పెరిగిన సౌదీ నిర్మాణ కాస్ట్ ఇండెక్స్..!!

2.4% మేర పెరిగిన సౌదీ నిర్మాణ కాస్ట్ ఇండెక్స్..!!

maa gulf 2 weeks ago

రియాద్: ఏప్రిల్ 2026లో సౌదీ అరేబియాలో నిర్మాణ వ్యయ సూచిక (Construction Cost Index) 2.4 శాతం మేర పెరిగింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) నివేదిక తెలిపింది.

నివాస రంగ నిర్మాణ వ్యయాలు 2.4 శాతం, నివాసేతర రంగ వ్యయాలు 2.7 శాతం పెరగడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని పేర్కొంది.

ఇక నివాస రంగ సూచిక గత ఏడాదితో పోలిస్తే 2.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీనికి పరికరాలు మరియు యంత్రాల అద్దె వ్యయాలు 4.7 శాతం పెరగడమే దీనికి ముఖ్య కారణంగా తెలిపింది.

ఏప్రిల్ 2025తో పోలిస్తే, ఆపరేటర్‌తో కూడిన పరికరాలు మరియు యంత్రాల అద్దె వ్యయాలు 6.3 శాతం, కార్మిక వ్యయాలు 2.8 శాతం, అలాగే ఇంధన ధరలు 3 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. అలాగే, ప్లాస్టిక్ మరియు గాజు ఉత్పత్తుల ధరలు 2.1 శాతం పెరగడం వల్ల ప్రాథమిక నిర్మాణ సామాగ్రి వ్యయాలు కూడా 1.2 శాతం మేర పెరిగాయని నివేదిక పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu