Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్ట్ 1న 'రక్త చరిత్ర 2' రీ రిలీజ్

ఆగస్ట్ 1న 'రక్త చరిత్ర 2' రీ రిలీజ్

maa gulf 19 hrs ago

హీరో సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ . మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి.

ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ధ శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులకు చెందిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబం ధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ గతంలో 'రక్త చరిత్ర' చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎలాంటి ఒత్తిడులు, భయాలకు లొంగకుండా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు సంచలనం సృష్టించాయి. నటీ నటులు తమ, తమ పాత్రలలో ఒదిగిపోయిన విధానం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్, అప్పట్లో ఆయన ఉపయోగించిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ చిత్రాలకు ఆయువు పట్టుగా నిలిచాయి. ఈ రెండు పార్ట్ చిత్రాలు ఒకే ఏడాది అనగా 2010లో వరుసగా విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది.

దాదాపు 16 ఏళ్ల తర్వాత రక్త చరిత్ర పార్ట్ 1 చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ చేయగా…హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మంచి స్పందన రావడంతో ఇప్పుడు రక్త చరిత్ర పార్ట్ 2 చిత్రాన్ని ఆగస్ట్ 1న థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర అంటూ సాగే నేపథ్య గీతంతో పాటు కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం అనే మరో పాటతో కలుపుకుని కథానుసారం సందర్భానుసారమైన రెండు పాటలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయమని చాలా రోజులుగా ప్రేక్షకులు కోరుతుండటంతో పాటు నేటితరం యూత్ కు కూడా వాస్తవిక కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో రామ్ గోపాల్ వర్మ రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu